కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ (Nagarjuna Sagar Polytechnic) కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య తెలిపారు. పాలీసెట్–2026లో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు, పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్లకు అర్హులని పేర్కొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
02 జూలై నుండి 03 జూలై 2026 వరకు నేరుగా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారాలు కళాశాలలోనే అందుబాటులో ఉంటాయి.
స్పాట్ అడ్మిషన్లు
04 జూలై 2026 (శనివారం) కళాశాల ప్రాంగణంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించబడతాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నిర్ణీత తేదీన తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering)
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE)
అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ (AMT)
హాజరయ్యే విద్యార్థులు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు
– పాలీసెట్–2026 ర్యాంక్ కార్డు (అర్హత సాధించిన వారికి)
– ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో
– 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
– ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టి.సి.)
– కుల ధ్రువీకరణ పత్రం (వర్తించిన వారికి)
– నివాస ధ్రువీకరణ పత్రం
– ఇతర సంబంధిత ధ్రువపత్రాలు

