Mobile Popup Ad
Mobile Popup Ad

అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. క్యూ కట్టిన భక్త జనం!

క‌లం, వెబ్‌డెస్క్‌: భారత్​ సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమం అమర్‌నాథ్​ యాత్ర (Amarnath Yatra) ఘనంగా ప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్​ యాత్రి నివాస్​ బేస్​ క్యాప్​ నుంచి లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా (Manoj Sinha) గురువారం ఉదయం జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దీనికి ముందు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు అధికారులు, రాజ‌కీయ నేత‌లు, పోలీసులు పాల్గొన్నారు. జెండా ఊపిన అనంత‌రం తొలి బృందం యాత్ర మొదలైంది. భక్తులు పహల్గామ్​, బల్తాల్​ మార్గాల ద్వారా పవిత్ర అమర్​నాథ్​ గుహకు చేరుకుంటారు.

మొద‌టి బృందంలో సుమారు 5 వేల మందికి పైగా భ‌క్తులు యాత్ర‌కు బ‌య‌లుదేరారు. హ‌ర హ‌ర మ‌హాదేవ్ అంటూ భ‌క్తిపార‌వ‌శ్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అమ‌ర్‌నాథ్ ప‌విత్ర గుహ వైపు వెళ్లే ఈ యాత్ర 57 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. అమ‌ర్‌నాథ్ యాత్ర‌ అధికారికంగా జూలై 3న ప్రారంభ‌మై ఆగ‌స్ట్ 28న ముగియ‌నుంది. భ‌క్తుల సంర‌క్ష‌ణ కోసం క‌శ్మీర్ అంత‌టా సెక్యూరిటీ పెంచారు. క‌ఠిన‌మైన ట్రాఫిక్ నియంత్ర‌ణ‌ల‌తో పాటు ప‌టిష్ట‌మైన నిఘాతో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌ర్‌నాథ్ యాత్ర కోసం 3.90 ల‌క్ష‌ల మంది భ‌క్తులు న‌మోదు చేసుకున్నారు. అర్హులైన వారి కోసం జ‌మ్మూలో త‌క్ష‌ణ రిజిస్ట్రేష‌న్ సౌక‌ర్యం కూడా క‌ల్పించారు. నేటి నుంచి జ‌మ్మూ-శ్రీన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌చ్చాయి. యాత్ర ముగిసే వ‌ర‌కు ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>