కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) బుధవారం సందర్శించి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంటీన్లో రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందిస్తున్న నిర్వాహకులు, సిబ్బందిని అభినందించారు.
ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో పోషక విలువలతో కూడిన నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భోజనం అనంతరం కలెక్టర్ (Collector Bhavesh Mishra) యూపీఐ ద్వారా స్వయంగా చెల్లింపు చేసి ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్డీఓ పీడీ విజయలక్ష్మితో పాటు ఇతర జిల్లా అధికారులు కూడా క్యాంటీన్లో భోజనం చేశారు.
Read Also: వాట్సాప్ ‘యూజర్‌నేమ్ ఫీచర్’పై కేంద్రం అలర్ట్..!
Follow Us On: Instagram

