కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో వాహనదారులకు భారీ ఉపశమనం లభించింది. ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ (Nayara Energy) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై ఐదు రూపాయలు, అలాగే లీటర్ డీజిల్‌పై మూడు రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల గ్లోబల్ ఆయిల్ రేట్లు దిగిరావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్ల కాలంలో దేశంలో ఇంధన ధరలను తగ్గించిన మొదటి ఇంధన రిటైలర్‌గా నయారా ఎనర్జీ నిలిచింది. దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్లను కలిగి ఉన్న నయారా ఎనర్జీ (Nayara Energy) తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
Read Also: నేషనల్ సిటిజన్ కార్డ్.. కేంద్రం సరికొత్త కసరత్తు!
Follow Us On: Instagram

