Mobile Popup Ad
Mobile Popup Ad

ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. అటు వైపు వెళ్లొద్దు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత కీలకమైన గచ్చిబౌలి (Gachibowli)–డీఎల్ఎఫ్ మార్గాన్ని జులై ఒకటో తేదీ నుంచి మూడు నెలల పాటు బంద్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేశ్ ప్రకటించారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టీపుల్ ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులను మరింత వేగవంతం చేసేందుకు ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల వైపు వెళ్లేవారు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా రెండు రూట్లలో వెళ్లాలని పేర్కొన్నారు

ఈ రూట్లలో మాత్రమే అనుమతి..

  • రాడిసన్ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వెళ్లేవారిని ఇక నుంచి డీఎల్ఎఫ్ గేట్ నెంబర్ వన్ వరకే అనుమతిస్తారు. అక్కడ గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లి, కుడి వైపు మలుపు తీసుకుని ఇందిరానగర్ మీదుగా ట్రిపుల్ ఐటీ జంక్షన్ వెళ్లొచ్చు.
  • టీసీఎస్ నాన్ సెజ్(CMC) గేట్ ద్వారా వెళ్లొచ్చేవారు, ఇక నుంచి కూడా అదే మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవు.
  • లింగంపల్లి నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్, రాడిసన్ హోటల్, డీఎల్ఎఫ్ వైపు వెళ్లే వాహనదారులు ఇక నుంచి దారి మళ్లాల్సి ఉంటుంది. మొదట ట్రిపుల్ ఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకోవాలి. అక్కడ ఎడమ మలుపు తీసుకుని రాడిసన్ హోటల్ జంక్షన్ వద్దకు చేరుకోవాలి. అక్కడ మరోసారి ఎడమ మలుపు తీసుకుని డీఎల్ఎఫ్ వైపు వెళ్లిపోవచ్చు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>