కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు (Sanjay Jaju) ఈ రోజు మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ రోజుతో ఉద్యోగ విరమణ చేయబోతుండగా.. వెంటనే సంజయ్ జాజు ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని సీఎస్ కార్యాలయంలో అందుకు ఏర్పాట్లు చేశారు.
కీలక శాఖలకు కార్యదర్శిగా..
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ జాజు (Sanjay Jaju) 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు కార్యదర్శిగా పనిచేసి మీ సేవ వంటి విప్లవాత్మక విధానాలు తీసుకొచ్చారు. 2014లో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన సంజయ్ జాజు.. సుదీర్ఘ కాలం సమాచార, మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణకు రిలీవ్ చేసింది. సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్రానికి వస్తూనే.. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపడుతుండటం గమనార్హం.
Read Also: రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గేమ్.. సీఎం సభకు వ్యూహాత్మక దూరం!
Follow Us On: Instagram

