కలం, వెబ్ డెస్క్: యూరప్ (Europe) ఖండాన్ని వడగాలులు వణికిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వడగాలులతో జూన్ 21 నుంచి ఇప్పటివరకు 1,300 మందికిపైగా మరణాలు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తీవ్ర ఉష్ణోగ్రతల (Heatwave) వల్ల కలిగే ‘హీట్ స్ట్రెస్’ సైలెంట్ కిల్లర్ మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూరప్‌లోని దాదాపు 150 మిలియన్ల మంది ప్రజలు వేడి వాతావరణంలో జీవిస్తున్నారని, అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి రికార్డులను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ తరహా వడగాలులు ఇప్పుడు ప్రతి సంవత్సరం సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ప్రపంచ సగటుతో పోలిస్తే యూరప్ (Europe) రెట్టింపు వేగంతో వేడెక్కుతోందని హెచ్చరించింది. అత్యవసర ఆరోగ్య రక్షణ చర్యలను పటిష్టం చేయాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On: Sharechat

