సర్ జాబితాలో పేరు లేదని వ్యక్తి ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: సర్ (SIR) జాబితాలో తన పేరు లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ బోరబండలో చోటు చేసుకుంది. స్థానిక లంబగుండు ప్రాంతానికి చెందిన షేక్ ముజీబుర్ రహ్మాన్(51) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సర్ జాబితాలో తన పేరు లేదంటూ కొద్ది రోజులుగా భార్య వద్ద వాపోతున్న రహ్మాన్ ఆదివారం రాత్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భార్య ఎంత నచ్చచెప్పినా వినిపించుకోని రహ్మాన్.. తనను జైలుకు పంపిస్తారేమోనని భయపడ్డాడు. అదే జరిగితే తన భార్య, ఇద్దరి పిల్లల పరిస్థితి ఎలా అని ఆవేదన చెందిన రహ్మాన్ సోమవారం ఉదయం ఇంటి బయట షెడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో, భార్యా పిల్లలు రోధిస్తున్నారు.

పేరు తప్పు పడటమే కారణమా..

రహ్మాన్ పేరు సర్టిఫికేట్లలో తప్పుగా పడటంతో, వాటిని సరిచేయించేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నాడని అతడి బంధువులు తెలిపారు. ఈ క్రమంలో రూ.40 వేల వరకు ఖర్చు చేసినా.. పేరు సరి చేయలేదన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తోటి వారు హెచ్చరించడంతో రహ్మాన్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు వివరించారు. సర్ జాబితాలో తన పేరు లేదని, చివరికి ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>