గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త

కలం, వెబ్ డెస్క్ : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల (Commercial LPG) సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభం శాంతి ఒప్పందంతో సద్దుమణగడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతల్లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై విధించిన పరిమితులను ఎత్తివేసినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ  ప్రకటన విడుదల చేసింది.

అయితే ఇది పూర్తిగా కాకుండా, ముందస్తు వినియోగ స్థాయిలతో పోలిస్తే దాదాపు 50 శాతం మేర సడలింపు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో బల్క్ ఎల్‌పీజీ సరఫరాను 50 శాతం వరకు పునరుద్ధరించవచ్చి పేర్కొంది. ఏది ఏమైనా కేంద్రం తాజా నిర్ణయంతో పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు భారీ ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. కాగా, కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ సదుపాయం ఉన్న వినియోగదారులు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే దానిని కొసాగించాలని సూచించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>