నిర్మల్ సబ్ జైలులో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్ జైలులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జైలు పర్యవేక్షణ అధికారి సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఖైదీలు, జైలు సిబ్బందితో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి, అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>