Mobile Popup Ad
Mobile Popup Ad

ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ

కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ శుభవార్త చెప్పింది. విద్యుత్ సంస్థల్లో 604 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల (AEE Jobs) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలై, జులై 27వ తేదీతో ముగియనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు తదితర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. తెలంగాణ విద్యార్థులు సైతం నిర్దేశించిన ఓపెన్ కోటాలో పరీక్ష రాసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఏపీ ట్రాన్స్ కోలో 200 పోస్టులు..

ఏపీ విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ట్రాన్స్ కోలో 200 ఏఈఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 1678, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగాల్లో 10 పోస్టులున్నాయి.

జెన్ కోలో 100 పోస్టులు..

ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్ కోలో 100 ఏఈఈ పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో 80 పోస్టులు, సివిల్ విభాగంలో 20 పోస్టులున్నాయి.

ఎస్పీడీసీఎల్‌లో 135 పోస్టులు..

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)లో 135 పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 125, సివిల్ విభాగంలో ఆరు, టెలికాం విభాగంలో నాలుగు పోస్టులున్నాయి.

సీపీడీసీఎల్‌లో 60 పోస్టులు..

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL)లో 60 పోస్టులున్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో మూడు, టెలికాం విభాగంలో ఒక ఏఈఈ పోస్ట్ ఉంది.

ఈపీడీసీఎల్‌లో 135 పోస్టులు..

ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL)లో 135 పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 128, సివిల్ విభాగంలో 4, టెలికాం విభాగంలో మూడు ఏఈఈ పోస్టులున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>