Mobile Popup Ad
Mobile Popup Ad

‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’కు అంతర్జాతీయ గుర్తింపు

కలం, సినిమా : భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాహుబలి ఫ్రాంచైజీ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’(Baahubali The Eternal War) ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతినిధులు ప్రపంచ ప్రఖ్యాత యానిమేషన్ ఉత్సవం అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో (Annecy Film Festival 2026) నిర్వహించిన WIP (Work In Progress) సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ను ప్రతినిధ్యం వహిస్తూ దర్శకుడు ఇషాన్ శుక్లా, నిర్మాత సౌమ్య శర్మతో పాటు అంతర్జాతీయ యానిమేషన్ నిపుణులు సైమన్ బ్రౌన్, ఆంటోయిన్ చార్యోన్, అజేయ్ లేలే ప్యానెలిస్టులుగా హాజరయ్యారు.

అన్నెసీ ఫెస్టివల్‌లో జరిగిన ఈ సెషన్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఆడిటోరియం పూర్తిగా నిండిపోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యానిమేషన్ రంగ నిపుణులు, అభిమానుల సమక్షంలో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించడం భారత యానిమేషన్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, బాహుబలి యూనివర్స్‌ని  కొత్త రూపంలో ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ యానిమేటెడ్ సిరీస్, యానిమేషన్ రంగంలోని అత్యంత ప్రతిష్టాత్మక వేదికలలో ఒకటైన అన్నెసీ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>