Mobile Popup Ad
Mobile Popup Ad

100 సీట్లతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుంది : టీపీసీసీ చీఫ్ మహేశ్

కలం, వెబ్ డెస్క్ : రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుంది అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్ నిర్వహించిన ఎస్టీ రిజర్వేషన్ల స్వర్ణోత్సవ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ పాల్గొని మాట్లాడారు.  అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అక్కున చేర్చుకుందని తెలిపారు.

బీఆర్ఎస్ (BRS) శకం ముగిసిందని.. కేటీఆర్, హరీష్ రావు గంగిరెద్దుల్లా ఊరేగుతున్నారని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. పేదల గుండెల్లో ఇందిరా గాంధీ పేరు చిరస్మరణీయం.. గుడిసెలు ఉండకూడదని ఇందిరమ్మ పేరుతో ఇల్లు నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందిరా గాంధీ దూర దృష్టి వల్లే దేశం ఉన్నత స్థాయిలో ఉందన్నారు.

బంగ్లాదేశ్ ను ఆనాడు ఇందిరా గాంధీ సృష్టిస్తే.. నేడు ఆమె కోడలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. ఇందిరా గాంధీ వల్లే రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు లేకపోతే ఎంతోమంది ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల్లో హోదాల్లో ఉండేవారా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుల సర్వే నిర్వహించినట్లు మహేశ్ గౌడ్ (TPCC Chief) స్పష్టం చేశారు.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>