Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ హైకోర్టులో ప్రైవేటు కాలేజీలకు ఊరట

క‌లం, వెబ్ డెస్క్: ఫీజుల వ‌సూళ్ల విష‌యంలో తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) లో ప్రైవేట్ కాలేజీల యాజ‌మాన్యాల‌కు ఊర‌ట ల‌భించింది. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌, ప్రైవేటు కాలేజీ ఫీజుల వ‌సూళ్ల‌పై కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఫీజుల వ‌సూళ్ల‌పై విడుద‌ల చేసిన జీవో నెంబ‌ర్ 9పై కోర్ట్ మ‌ధ్యంత‌ర స్టే విధించింది. మంగ‌ళ‌వారం వ‌ర‌కు ఈ స్టే కొన‌సాగ‌నుంది. ప్ర‌భుత్వం స‌కాలంలో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ (Reimbursement) ఇవ్వ‌క‌పోతే కాలేజీల నిర్వ‌హ‌ణ ఎలా సాగుతుంద‌ని కోర్టు ప్ర‌శ్నించింది.

ఇటు ప్ర‌భుత్వం ఇవ్వ‌కుండా, అటు యాజ‌మాన్యాల‌ను వ‌సూలు చేసుకోనివ్వ‌కుండా కాలేజీలు ఎలా న‌డుస్తాయ‌ని నిల‌దీసింది. అస‌లు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప్ర‌క్రియ ఎంత వ‌ర‌కు వ‌చ్చింద‌ని, బ‌డ్జెట్‌లో దీని కోసం ఎన్ని కోట్లు కేటాయించార‌ని కోర్టు ఆరా తీసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన కేటాయింపులు, పెండింగ్ బకాయిల‌పై వివ‌ర‌ణ కోరింది. వ‌చ్చే మంగ‌ళ‌వారం త‌దుప‌రి విచార‌ణ జ‌రుగునున్న నేప‌థ్యంలో వివ‌రాల‌తో కోర్టుకు (Telangana High Court) రావాల‌ని సూచించింది.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>