నేడు చీక‌టి రోజు అంటున్న సీఎం యోగి.. ఎందుకంటే?

క‌లం, వెబ్ డెస్క్: ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Yogi Adityanath) జూన్ 25ను చీక‌టి రోజుగా అభివ‌ర్ణిస్తూ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. 1975లో ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమ‌ర్జెన్సీ (Emergency)విధించిన నేప‌థ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.

అధికార అహంకారంతో కాంగ్రెస్​ సర్కార్​ అమలు చేసిన ఎమర్జెన్సీ భావ ప్రకటన స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలను దెబ్బ తీసిందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆ కాలంలో జరిగిన పరిణామాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని యోగి ఆదిత్యా నాథ్ (Yogi Adityanath)​ తన పోస్టులో రాసుకొచ్చారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం ఎంతోమంది యోధులు పోరాడార‌ని, వారంద‌రినీ ప్ర‌తి ఒక్క‌రూ స్మ‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

Read Also: ఏఐనీ చెడగొట్టేశారు.. యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్‌లో సంచలన విషయాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>