గల్ఫ్ మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అండ

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన జగదీష్ అనే యువకుడు ఉపాధి నిమిత్తం యూఏఈలోని దుబాయ్ కి వెళ్లగా, ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, మండల బీజేపీ నాయకులు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు, ఎన్ఆర్ఐ సెల్ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Read Also: వైభవ్‌కు ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్.. ఎందుకో చెప్పిన ఈసీబీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>