కలం, మెదక్ బ్యూరో : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు అన్నదాత సేవలు అందించడం గొప్ప పుణ్యకార్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని దక్షిణాది అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో యాత్రికుల కోసం సేకరించిన అన్నప్రసాద సరుకుల లారీని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమర్‌నాథ్ యాత్రికులకు ( Amarnath Pilgrims) ఆహారం, త్రాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించేందుకు సేవా సమితి చేస్తున్న కృషిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అభినందించారు. భక్తి, సేవాభావం కలిసిన ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య , మున్సిపల్ చైర్‌పర్సన్ ఆస సులోచన స్వామి పాల్గొన్నారు.
Read Also: వరంగల్‌లో అక్రమాలు.. రెవెన్యూ అధికారి భూ లీలలెన్నో!
Follow Us On: Instagram

