కలం, వెబ్ డెస్క్: ఉన్నతమైన పదవికి మనిషి నిరాడంబరత తోడైతే గొప్ప నాయకత్వం నిత్యం కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ మాటలు తమిళనాడు సీఎం విజయ్‌కు (CM Vijay) అతికినట్టుగా సరిపోతాయి. తాను మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతన ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఎం విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక గర్భిణీకి తొలి నియామక పత్రాన్ని అందజేయాల్సి ఉంది. అయితే, ఆమె పరిస్థితిని గమనించిన విజయ్ ఆమెను వేదికపైకి పిలిపించి ఇబ్బంది పెట్టకూడదని భావించాడు.
వెంటనే సీఎం విజయ్ (CM Vijay) ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి, స్వయంగా వేదికపై నుంచి కిందకు దిగివచ్చాడు. మహిళ వద్దకు వెళ్లి చిరునవ్వుతో తొలి నియామక పత్రాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపాడు. ముఖ్యమంత్రి చూపిన ఈ గొప్ప చొరవ మహిళల పట్ల ఆయనకు ఉన్న మానవత్వాన్ని చాటిచెప్పాయి. సీఎం చేసిన ఈ ఆదర్శవంతమైన పనికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయి, చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోసారి విజయ్‌కు ప్రజల నుంచి ప్రశంసలు దక్కాయి.

