కలం, నాగార్జునసాగర్: భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ పర్యావరణ ప్రతినిధులు నాగార్జునసాగర్‌ను (Nagarjuna Sagar) మంగళవారం సందర్శించారు. తెలంగాణ పర్యావరణ అటవీ, విజ్ఞాన, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో నాగార్జునసాగర్‌ను సందర్శించారు. వీరికి నల్గొండ ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి స్వాగతం పలికారు. నాగార్జునసాగర్ డ్యామ్, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, బుద్ధవనం, ఇతర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ చరిత్ర తెలుసుకొని ఆశ్చర్యపోయారు. సాగర్‌లో పర్యటించినవారిలో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన 16 దేశాల నుంచి 36 మంది విదేశీ పర్యావరణ ప్రతినిధులున్నారు.

