నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం పరిధిలోని మహంకాళి ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Ramarao Patel) స్పందించారు. విషయం తెలుసుకున్న ఆయన సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ తో కలిసి మంగళవారం ఆలయాన్ని సందర్శించి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో మాట్లాడి చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. చోరీకి పాల్పడిన దుండగులను త్వరితగతిన గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

