కలం, వెబ్ డెస్క్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కేతావత్ రామకృష్ణను (Kethavath Ramakrishna) నియమించారు. ఈ మేరకు సోమవారం ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉదిత్ రాజ్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్లో మూడు రోజులపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో రామకృష్ణకు నియామక పత్రం అందించారు.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ (SC, ST, BC, Minorities Federation) అభ్యున్నతికి రామకృష్ణ కృషి చేస్తారని ఉదిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం రామకృష్ణ హైదరాబాద్ డివిజన్ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్ల సంఘం జనరల్ సెక్రటరీగా, తెలంగాణ ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నారు. అలాగే భారత రాజ్యాంగ వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. తనపై నమ్మకంతో ఎంపికకు సహకరించిన వారికి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సంఘాల బలోపేతానికి మరింత కృషి చేస్తానని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

