Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ కార్యకర్తలపై మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సహనం కోల్పోయారు. కార్యకర్తల తీరుతో విసిగిపోయిన ఆయన ‘మీరు పనికి రాని వాళ్లు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగళూరులో కొత్త పీసీసీ అధ్యక్షుడు బి.కె.హరిప్రసాద్ పదవీ బాధ్యతల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్న క్రమంలో డీకే.శివకుమార్ పేరు ఉచ్ఛరించడంతో ఆయనకు మద్దతుగా కార్యకర్తలు పెద్ద పెకరట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో కొన్ని సెకండ్ల పాటు ప్రసంగం ఆపిన ఖర్గే.. వారి తీరుని తప్పుబట్టారు. డీకే.శివకుమార్ అంటూ నినాదాలు చేస్తున్న వారు, మిగతావారు చెత్త ఊడ్చడానికి వచ్చారని భావిస్తున్నారా.. అని ప్రశ్నించారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదంటూ చురకలు అంటించారు. పార్టీ వలనే గుర్తింపు వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఇలా గందరగోళం చేసిన కార్యకర్తలను గుర్తించి.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>