కలం, సినిమా : టాలీవుడ్‌లో మరో ఆసక్తికర ప్రాజెక్ట్ సిద్దమవుతుంది. సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) – బన్నీ వాస్ వర్క్స్ (Bunny Vas Works) సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న కొత్త సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. ఈ చిత్రంలో టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా, నాగ దుర్గ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ లాంచ్ జూన్ 25న జరగనున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా సుకుమార్‌తో పాటు ఆయన భార్య తబితా సుకుమార్ కూడా టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం, కుటుంబ కథా నేపథ్యంలో ఎమోషన్‌తో పాటు వినోదాన్ని కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. బలమైన కథ, సృజనాత్మక టీమ్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాలలో మంచి అంచనాలు నెలకొన్నాయి. గ్రాండ్ లాంచ్‌తో ఈ సినిమా అధికారికంగా ప్రారంభమవుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

