కలం, కరీంనగర్ బ్యూరో: భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణ లో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకన్న (MVI Venkanna) మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వెంకన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధినిర్వహణలో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

