Mobile Popup Ad
Mobile Popup Ad

అన్ని జిల్లాలో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టాలి.. టీఆర్ఎస్ డిమాండ్

కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి (TRS) జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ (Karimnagar) లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టాలని గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇచ్చిన భాగస్వామ్యం చాలా గొప్పదని, వారి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో వారి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు జయశంకర్ సార్ అని అన్నారు.

స్వరాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులను, యువకులను, మేధావులను, ప్రజలను చైతన్య పరిచి తెలంగాణ ఉద్యమకారులను సిద్ధం చేసి స్వరాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించాడని గుంజపడుగు హరిప్రసాద్ చెప్పారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యకల తిరుపతి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, మహిళ విభాగం సీనియర్ నాయకురాలు జంగా అపర్ణ సాగర్ సీనియర్ నాయకులు గాలిపెల్లి రత్నాకర్ చారి, జిల్లా యువజన విభాగం నాయకులు నూతి సాయిచరణ్ పూసాల పవన్, సంతు తదితరులు పాల్గొన్నారు.

Read Also: భార‌త్‌ను చూసి అమెరికా నేర్చుకోవాలి.. ఫారిన్ యువ‌తి ప్ర‌శంస‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>