ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్‌.. నీరజ్, పారుల్ హవా..!

క‌లం, వెబ్ డెస్క్: భారత అథ్లెటిక్స్‌లో విశేష ప్రతిభ కనబర్చిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra), పరుగుల వీరనారి పారుల్ చౌదరి (Parul Chaudhary)కి తొలి ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్‌లో అత్యుత్తమ అథ్లెట్ పురస్కారాలు లభించాయి. పురుషుల విభాగంలో నీరజ్, మహిళల విభాగంలో పారుల్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అవార్డులను ప్రదానం చేశారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.

ఉద్భవిస్తున్న ప్రతిభ విభాగంలో షహ్నవాజ్ ఖాన్, పూజ ఉత్తమ యువ అథ్లెట్లుగా ఎంపికయ్యారు. ఉత్తమ అథ్లెట్లుగా నిలిచిన నీరజ్, పారుల్‌కు రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందించగా, షహ్నవాజ్, పూజలకు రూ.2.5 లక్షల చొప్పున ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భారత అథ్లెటిక్స్‌కు విశేష సేవలందించిన పీటీ ఉష, అంజు బాబీ జార్జ్, గుర్బచన్ సింగ్ రంధావా, బహదూర్ సింగ్ చౌహాన్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. వారికి రూ.5 లక్షల చొప్పున నగదు బహుమతి కూడా ఇచ్చారు. దేశంలో అథ్లెటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, కొత్త ప్రతిభ ప్రపంచ వేదికలపై రాణిస్తోందని అవార్డు గ్రహీతలు పేర్కొన్నారు. ఇలాంటి అవార్డులు మరింత మెరుగైన ప్రదర్శనలకు ప్రేరణగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>