Mobile Popup Ad
Mobile Popup Ad

సాయికృష్ణ కేసు దర్యాప్తు.. వెలుగులోకి సంచలన విషయాలు!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతున్న సాయికృష్ణ కేసు (Sai Krishna Case) విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రపై విచారణాధికారులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మార్కాపురం నుండి విజయవాడ వరకు సాగిన ఎపిసోడ్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, టాస్క్ ఫోర్స్ ఎస్సై నవీన్ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు మార్కాపురానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుండి సాయికృష్ణను ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తీసుకువచ్చినట్లు బలమైన ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు.

ఈ కేసులో (Sai Krishna Case) భాగంగా ఇప్పటికే అడిషనల్ డీసీపీ లతాకుమారి, ఎస్సై నవీన్ తో పాటు సదరు కానిస్టేబుళ్ల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. అయితే, అసలు ఎవరి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం మార్కాపురానికి వెళ్లింది? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విచారణ పూర్తి అయితే మరికొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: మీ అందాన్ని దెబ్బతీసే సాధారణ పొరపాట్లు ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>