కలం, వెబ్ డెస్క్ : దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాని మోదీ రేపు, ఎల్లుండి పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ( జూన్ 20) 26వ విడత పీఎం కిసాన్ (PM Kisan) డబ్బులను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్ల నిధులను ప్రధాని మోదీ రిలీజ్ చేయనున్నారు.
కాగా, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా కేంద్రం రైతులకు పంట సాయం కింద ఏడాదికి రూ.6వేలు అందిస్తోంది. వీటిని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఈ పథకం తీసుకువచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 25 సార్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయగా.. రేపు 26వ విడత నిధులను కేంద్రం విడుదల చేయనుంది.

