నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి!

కలం, నాగార్జునసాగర్ : నల్గొండ (Nalgonda) జిల్లా పెద్దవుర మండలం రామన్నగూడెం ముత్యాలమ్మ టెంపుల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరణించిన వారిలో ఇద్దరు తండ్రి కొడుకులు కాగా, మరొకరు SLBC లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు స్పాట్‌కు చేరుకుని క్షతగాత్రులను 108లో సమీప ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతులను సాయికుమార్, థాంసయ్య, ప్రకాశ్‌రావుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>