బండ రాయితో కొట్టి భర్తను హతమార్చిన భార్య..!

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు (Gudur) మండల పరిధిలోని సోమల తండాలో దారుణం చోటు చేసుకుంది. దంప‌తుల‌ మ‌ధ్య జ‌రిగిన చిన్న గొడ‌వ భార్య చేతిలో భ‌ర్త హ‌త్య‌కు దారి తీసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. సోమ‌ల తండాలో బోడ లాలు త‌న‌ భార్య విజయతో క‌లిసి ఉండేవాడు. లాలు దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో లాలూ హైదరాబాద్‌లో ఉంటూ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. విజయ తండాలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంది. బుధవారం తండాలో ఓ వివాహ వేడుక జ‌రిగింది.

ఈ వేడుక‌కు హాజరైన లాలు సాయంత్రం ఇంటికి వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల‌ విసుగు చెందిన విజయ అత‌డి తలపై బండ రాయితో బ‌లంగా కొట్టింది. దీంతో లాలు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల స‌మాచారం మేరకు పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. లాలు భార్య విజ‌య‌పై కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్‌’ ట్రెండ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>