ఫీజులు తగ్గించాల్సిందే.. హనుమకొండ డీఈవో ఆఫీస్ ముట్టడి!

కలం, హనుమకొండ : : హనుమకొండ (Hanamkonda) జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) శ్రేణులు ఉధృత ఆందోళన చేపట్టాయి. విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచేసిన అధిక ఫీజులను తక్షణమే అరికట్టాలనే డిమాండ్‌తో ఏబీవీపీ విద్యార్థి నాయకులు హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయాన్ని ముట్టడించారు.

కార్యాలయంలోకి దూసుకెళ్లిన విద్యార్థి నాయకులు అక్కడే బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీని అరికట్టడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని, కొందరు అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారని వారు తీవ్రంగా ఆరోపించారు. కార్యాలయం లోపల ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో, పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో డీఈవో కార్యాలయ ప్రాంగణంలో కాసేపు తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.

Read Also: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>