ఆగస్టులో నారాయణపేట కలెక్టరేట్ ప్రారంభం: మంత్రి శ్రీహరి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణ పేట (Narayanpet)  జిల్లా కలెక్టరేట్‌ను ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రారంభిస్తామని రాష్ట్ర క్రీడ, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక ,మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ) పనులను కలెక్టర్ ప్రియాంకతో కలిసి పరిశీలించారు. మీటింగ్ హాల్, మంత్రి, కలెక్టర్ ఛాంబర్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. కలెక్టరేట్ బిల్డింగ్ ప్రాంగణంలోనే హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. చివరగా నూతన కలెక్టరేట్ సమీపంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఇచ్చిన ఏడు ఎకరాలు ఎకరాల ప్రభుత్వ స్థలంపై డీఎస్పీ లింగయ్యతో మంత్రి ఆరా తీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>