పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై దాడికి యత్నం

కలం, వెబ్ డెస్క్: పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై (MLA Balaraju) ఓ యువకుడు దాడికి యత్నించడం కలకలం రేపింది. ఇటీవల కాలంలో వంశీ అనే యువకుడు ఎమ్మెల్యే బాలరాజుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వంశీని పీఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. ఈ నేపథ్యలో కొందరు వ్యక్తులతో క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన వంశీ.. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించాడు. గన్‌మెన్, సిబ్బంది అప్రమత్తమై వంశీని అడ్డుకున్నారు. అనంతరం జీలుగుమిల్లి పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>