పీవోకేలో పాక్ సైన్యం అరాచకం.. 16 మంది మృతి

కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) సైన్యం పీవోకే ప్రజలపై అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. రావల్‌కోట్‌లో నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో 16 మందికి పైగా మృతి చెందారు. అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. నిన్న జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (జేఏఏసీ)పై నిషేధానికి వ్యతిరేకంగా కొంతకాలంగా జరుగుతున్న నిరసనలు రక్తసిక్తమవుతున్నాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండా పాక్ సైన్యం నేరుగా కాల్పులు జరుపుతున్నట్లు స్థానిక పౌర హక్కుల నేతలు చెబుతున్నారు. వెంటనే అంతర్జాతీయ సమాజం స్పందించి, పాక్ దురాగతాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>