కలం, వెబ్ డెస్క్ : కేరళలో మరోసారి నిఫా వైరస్ (Nipah Virus) తీవ్ర కలకలం రేపుతోంది. కోజికోడ్‌జిల్లాకు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ముందస్తు చర్యలతో వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ యత్నిస్తోంది. ఈ మేరకు బాధితుడిని కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్‌లో ఉంచే చర్యలను ఆరోగ్య శాఖ ప్రారంభించింది.
‘ఆందోళన చెందవద్దు’
నిఫా వైరస్ తీవ్ర కల్లోలం సృష్టిస్తోన్న వేళ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిఫా వైరస్ పై ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పారు. రోగి శాంపిల్స్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని.. తుది ఫలితాలు నేడో, రేపో వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

