భారత నౌకపై అమెరికా దాడి.. కేంద్రం కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: భారత నౌకపై అమెరికా దాడి చేసిన ఘటనలో ముగ్గురు నావికులు మరణించడంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అగ్రరాజ్యానికి తన తీవ్ర నిరసన తెలిపినట్లు కేంద్ర విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. “ఎంటీ సెట్టెబెల్లో అనే భారత నౌకపై దాడి జరిగినట్లు సమాచారం అందిన వెంటనే అమెరికా సీడీఏకు సమన్లు జారీ చేసి పిలిపించాం. యూఎస్ నేవీ ఈ దాడికి పాల్పడిందని పూర్తి ఆధారాలు సమర్పించాం. ఈ దాడిలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న మూడు నౌకలు విదేశాలకు చెందినవే. వీటిలో ఒక్కటీ కూడా భారత్‌వి లేవు” అన్నారు.

గల్ప్​ ప్రాంతంలో 18 వేల మంది నావికులు..

భారత నావికుల భద్రతపై సందేహాలు తలెత్తుతున్న వేళ కేంద్ర పోర్టులు, షిప్సింగ్ మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ ముకేశ్ మంగళ్ స్పందించారు. ‘గల్ఫ్​ ప్రాంతంలో 18 వేల మందికి పైగా భారత నావికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో గల్ఫ్​ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో 233 మంది, పర్షియన్ గల్ఫ్‌లో 329 మంది పనిచేస్తున్నారు. మరో 562 మంది భారత నావికులు భారత జెండాలతో ప్రయాణిస్తున్న నౌకల్లో ఉన్నారు’ అని వివరించారు. వీరి భద్రతపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. తమ మంత్రిత్వ శాఖ వారితో నిరంతరం టచ్‌లో ఉంటున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>