Mobile Popup Ad
Mobile Popup Ad

జంతర్ మంతర్‌లో మహా ప్రదర్శన.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పిలుపు

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) మరో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దేశ విద్యా వ్యవస్థను కాపాడాలని భావించే ప్రతి భారతీయుడు ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) వద్దకు రావాలని కోరింది. దేశంలో విద్యా రంగంపై పెరుగుతున్న సమస్యలు, విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ మహా నిరసన చేపడుతున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది.

విద్యా వ్యవస్థను రక్షించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొంది. ఈ నిరసనలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఆయన విధానాల వల్ల విద్యా రంగం దెబ్బతింటోందని ఆరోపిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. 20వ తేదీన జరగనున్న ఈ నిరసన దేశ రాజకీయ వాతావరణంలో కీలకంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>