మల్కాజిగిరిలో దారుణం.. భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త

కలం, వెబ్​ డెస్క్​ : మల్కాజిగిరి (Malkajgiri)లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త తుపాకీతో కాల్చి హత్య చేశాడు. బుధవారం ఉదయం జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు.. మల్కాజిగిరి మారుతీనగర్​ కు చెందిన అరుణ్​ కుమార్ తన భార్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో నిషిత రాణి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, నిషితకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్​ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో గతంలోనే నిషితపై హత్యకు ప్రయత్నించిన అరుణ్​ పోలీసులకు చిక్కాడు. ఈ వార్త అప్పట్లోనే వార్తల్లోకి ఎక్కింది.

అయితే, ఆలోచన మారని అరుణ్​.. నిషితను ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి బయటకు పిలిపించాడు. ఈ క్రమంలో మరో వ్యక్తితో కలిసి నిషిత రాణిపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>