బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటాం: లోకేశ్

కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబసభ్యులను మంత్రి లోకేశ్ (Lokesh) పరామర్శించారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి కేజీహెచ్‌‌కు చేరుకొని బాధిత కుటుంబాలకు (Vizag Steel Plant Accident Victims) ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వపరంగా అన్నివిధాల అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు లోకేశ్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడేందుకు వచ్చానని.. తమకు జీవితాంతం అండగా ఉంటామని భరోసా కల్పించారు. అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని చెప్పారు. ఈ ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>