సింగరేణిపై రెయిన్ ఎఫెక్ట్.. బొగ్గు ఉత్పత్తికి బిగ్ బ్రేక్!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు సింగరేణి (Singareni) బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా గనులు, రవాణా రహదారులు పూర్తిగా బురదమయంగా మారాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు భారీగా చేరడంతో యంత్రాల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. దీని ఫలితంగా బొగ్గు తవ్వకం, లోడింగ్, డంపింగ్, రవాణా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాల ప్రభావంతో సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి వర్గాలు వెల్లడించాయి.

​వర్షాలు తగ్గిన వెంటనే గనుల్లో చేరిన నీటిని తొలగించి, యంత్రాలను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం గనుల్లో నిలిచిన నీటిని తోడే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఉత్పత్తిని సాధారణ స్థితికి తీసుకువస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. ఒకవేళ వర్షాలు ఇలాగే కొనసాగితే బొగ్గు ఉత్పత్తి, రవాణా మరింత దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>