Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రిలో 105 కేజీల గంజాయి పట్టివేత

కలం/ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా రెండు కార్లు అనుమానాస్పదంగా కదలాడటం గమనించిన పోలీసులు.. వెంటనే ఆపి.. తనిఖీ చేశారు. రెండు కార్లలో కలిపి 105.54 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.53 లక్షలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను విచారించగా, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా డొంకరాయి నుంచి షిరిడీకి తరలిస్తున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.

ముగ్గురు నిందితులు నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం ఎర్రగాళ్లపల్లి గ్రామానికి చెందిన శివాకర్ ప్రమోద్ కుమార్, బైరీశెట్టి భార్గవ్, రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన అందేకర్ శ్రీనివాస్ గా గుర్తించారు. వీరి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మీ తెలిపారు. మరింత సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>