కొల్లూరులో గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం (Ganja Seized) చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన జై బిస్వాస్ (23), ప్రశాంతజిత్ రాయ్ (22) అనే ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి కొల్లూరు పరిధిలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు దాన్ని విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఈ విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 10 కిలోల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.

Read Also: లోక్​సభలో మరో కీలక బిల్లు..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>