హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతులు మృతి

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం (Anantapur Accident) చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న ఒక హోటల్‌లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కాగా, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఘటనా స్థలంలోనే ఒక యువతి ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి తరలించే క్రమంలో తీవ్రంగా గాయపడిన మరొక యువతి కన్నుమూసింది. మృతులను హరిత, నవనీతగా అధికారులు గుర్తించారు. కారులో ఉన్న మిగిలిన ఇద్దరు యువకులకు కూడా తీవ్ర గాయాలవ్వడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

అతివేగంతో వచ్చిన కారు హోటల్‌లోకి దూసుకెళ్లడంతో భారీ శబ్దం వచ్చిందని, క్షణాల వ్యవధిలోనే ఘోరం జరిగిపోయిందని అక్కడ ఉన్న ప్రత్యక్షసాక్ష్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>