తొలగింపుపై రోహిత్ క్లారిటీ ఇచ్చాడు: చాహల్

కలం, స్పోర్ట్స్​ : ప్రపంచకప్ జట్టు నుంచి తనను తొలగించడంపై అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ తనకు పూర్తి క్లారిటీ ఇచ్చాడని భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) వెల్లడించారు. టీమ్ అవసరాలు, కాంబినేషన్ల రీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ తనకు స్వయంగా వివరించాడని తెలిపారు. 2023లో తాను కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో రోహిత్ తనతో మాట్లాడాడని చాహల్ చెప్పారు. జట్టులో ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్ళు కావాలని, అందుకే ఆ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారన్నారు.

అలాగే ప్రపంచకప్ కోసం ఒక అదనపు ఫాస్ట్ బౌలర్ కూడా అవసరమని రోహిత్ స్పష్టం చేశాడని చాహల్​ (Yuzvendra Chahal) వివరించారు. ఈ విధంగా కెప్టెన్ నుంచి స్పష్టమైన వివరణ రావడంతో, ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఎంపికల గురించి ఆలోచించడం పూర్తిగా మానేశానని పేర్కొన్నారు. అయితే 2024 ఐపీఎల్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి రాణించడంతో రోహిత్ మళ్లీ తనను సంప్రదించాడని తెలిపారు. ఆ సీజన్‌లో తన ప్రదర్శన చూసి, తనను ప్రపంచకప్ జట్టులో కోరుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడని తెలిపారు.

సెలక్షన్ మీటింగ్‌లో చూద్దామని తెలిపినట్లు చాహల్ చెప్పారు. గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ 2022 ప్రపంచకప్‌లో కూడా రోహిత్ తనకు ముందుగానే క్లారిటీ ఇచ్చాడన్నారు. ఒక నిర్దిష్టమైన కాంబినేషన్ కుదిరితేనే తనకు అవకాశం వస్తుందని చెప్పారని వెల్లడించారు. వరల్డ్ కప్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడితే బాగుండేదని అనిపించినప్పటికీ, రోహిత్ ఇచ్చిన క్లారిటీ వల్ల తనకు విషయం అర్థమైందని చాహల్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>