పారా గేమ్స్‌ సెలక్షన్స్​పై వివాదం.. కోర్టుకెక్కిన చిరాగ్ బారేథా!

కలం, స్పోర్ట్స్ : పతకం ఖాయమనుకున్న స్టార్ ఆటగాడిని పక్కనపెట్టి… నిషేధం ఎదుర్కొన్న వ్యక్తికి చోటిచ్చారు. జపాన్‌లో జరగనున్న ఏషియన్ పారా గేమ్స్ ఎంపికల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ రెండుసార్లు ఆసియా పతక విజేత చిరాగ్ బారేథా (Chirag Baretha), ఇతర పారా షట్లర్లు బాంబు పేల్చారు. తమను అన్యాయంగా తొలగించారంటూ ఏకంగా ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. శశాంక్ కుమార్, అమ్ము మోహన్, మనీషా పటేల్‌లతో కలిసి చిరాగ్ బారేథా వేసిన పిటిషన్‌తో భారత క్రీడా రంగంలో కలకలం రేగింది.

క్రీడా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం తాము ఆసియా టాప్-6 ర్యాంకింగ్‌లో ఉన్నామని, అయినప్పటికీ తమ పేరును తొలగించారని వారు ఆరోపించారు. అంతర్జాతీయంగా సరైన ర్యాంకింగ్ లేని, గతంలో డోపింగ్ నిషేధం పడిన రాకేష్ పాండేకు జట్టులో చోటు కల్పించడంపై వారు మండిపడ్డారు. ఆటగాళ్ల అనుమతి లేకుండానే డబుల్స్ జోడీలను మార్చేశారని, కనీస నిబంధనలు కూడా పాటించలేదని ధ్వజమెత్తారు.

అర్హత సాధించినా అధికారి కే ప్రభాకర్ రావు తమను మోసం చేసి, నాలుగేళ్ల కష్టాన్ని తొక్కేశారని చిరాగ్ (Chirag Baretha) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి కచ్చితంగా పతకం అందించే అవకాశాన్ని కావాలని అడ్డుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎంపికల జాబితా ‘సాయ్’ నుంచి వచ్చిందని, తమ పాత్ర ఏమీ లేదని బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. అధికారులు, నాయకులు ముఖం చాటేయడంతో క్రీడాకారులు న్యాయపోరాటానికి దిగారు. ప్రస్తుతం ఈ ఎంపికల రగడ కోర్టు పరిధిలో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>