కలం, కరీంనగర్: కరీంనగర్లో జర్నలిస్టులు పోతూరి శేఖర్, సంపత్లపై పోలీసుల వేధింపులు, దాడి, కులం పేరుతో అవమానించారనే ఆరోపణలపై జాతీయ షెడ్యూల్డ్ కాస్ట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది నక్క ప్రమోద్ (Nakka Pramod) తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. బాధితులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వైద్య నివేదికలు, ఇతర ఆధారాలను పరిశీలించి నిజానిజాలు వెలికితీయాలని కమిషన్కు విజ్ఞప్తి చేసినట్లు న్యాయవాది తెలిపారు.

