వైసీపీ ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్ : తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సీనియర్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరుపై అధిష్టానానికి ఇటీవల అందిన నివేదికల నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, నేతల పనితీరు సమీక్ష వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి స్థానంలోనూ పోటీ చేసేలా కేడర్‌ను సిద్ధం చేయాలని, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని నాయకులకు చెప్పారు . ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నాయకుల అభిప్రాయాలను సేకరించిన అధిష్టానం… సంస్థాగత మార్పులు, పార్టీ కార్యక్రమాల అమలుపై ఆదేశాలు జారీ చేసింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>