వైఎస్ వివేకా హత్య కేసు: ఈడీ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి!

కలం, వెబ్ డెస్క్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ఎదుట వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. కోకాపేటలోని తన నివాసం నుంచి హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ కేసులో A-8 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని, హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీల అంశాలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.

గతంలో ఆగస్టు 21న అవినాష్ రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు లెక్క చూపని రూ. 24 లక్షల నగదుతో పాటు రెండు బ్యాంకు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌, హత్య కోసం సుమారు రూ. 40 కోట్ల సుపారీ చేతులు మారిందనే ఫండింగ్ కోణాలపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. అవినాష్ రెడ్డి తీసుకువచ్చిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, డిజిటల్ ఆధారాల ఆధారంగా ఈ విచారణను చేపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>