అఖిల భారత కబడ్డీ పోటీల్లో శ్రీ సరస్వతీ విద్యామందిర్ విద్యార్థుల సత్తా

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి శ్రీ సరస్వతీ విద్యామందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అఖిల భారత స్థాయిలో తమ క్రీడా ప్రతిభను చాటుతూ అద్భుత విజయాన్ని సాధించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్‌లో జరిగిన అఖిల భారత స్థాయి (నేషనల్) కబడ్డీ పోటీలలో (దక్షిణమధ్య క్షేత్ర) శ్రీ సరస్వతీ విద్యామందిర్ ఉన్నత పాఠశాల కామారెడ్డికి చెందిన విద్యార్థులు (Kamareddy Students) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, కామారెడ్డి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు.

ఈ అఖిల భారత స్థాయి పోటీల ఫైనల్లో దక్షిణ మధ్య క్షేత్రం జట్టు ఉత్తరప్రదేశ్ జట్టుతో తలపడింది. విద్యార్థులు తమ అద్భుతమైన ఆటతీరు, పట్టుదల, క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తితో ప్రత్యర్థిని లొంగదీసుకుని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన క్రీడానైపుణ్యం, ఆత్మవిశ్వాసం, వారి కఠోర సాధనకు, పాఠశాల క్రీడా శిక్షణకు, ఉపాధ్యాయుల ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలిచింది.

పాఠశాల యాజమాన్యం హర్షం

విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించడం పట్ల పాఠశాల ప్రబంధ కారిణి సభ్యులు, ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు ఉపాధ్యాయినులు హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయం పాఠశాలకే కాకుండా కామారెడ్డి ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాల ప్రతినిధులు పేర్కొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>