కలం, యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో(Yadadri Temple) ఆదివారం భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల సందడితో కన్నుల పండువగా మారాయి. కొండపై ఆలయ పరిసరాలు, మాఢవీధుల్లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోందని భక్తులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

